![సందట్లో సడేమియా.. సౌత్ సెంట్రల్ కుట్ర!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/08vsc21e-606377_mr-1739128681-0.jpg.webp?itok=dTQCUiIV)
సందట్లో సడేమియా.. సౌత్ సెంట్రల్ కుట్ర!
ఓవైపు సరిహద్దుల విభజనలతో వాల్తేరు డివిజన్ సతమతమవుతుంటే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ వివక్షను వీడటం లేదు. విశాఖ నుంచి నడిచే ముఖ్యమైన రైళ్లను సైతం ఏదో ఒక సాకుతో రద్దు చేస్తున్నారు. గతంలో 150 నుంచి 175 శాతం ఆక్యుపెన్సీతో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రత్నాచల్, సింహాద్రి, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ట్రాక్ మరమ్మతులు, ఆధునికీకరణ పనులు, మెయింటెనెన్స్ అంటూ కారణాలు చూపుతూ చాలా రోజులు రద్దు చేశారు. తాజాగా అత్యంత రద్దీగా నడుస్తున్న విశాఖపట్నం – ముంబై (185190/18520) ఎల్‌టీటీ రైలుపై కక్షగట్టారు. నాన్–ఇంటర్‌లాకింగ్ పనుల పేరుతో ఈ నెల 10 నుంచి 20 వరకు ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ రైలుకు 20వ తేదీ వరకు రెండువైపులా 230 శాతం ఆక్యుపెన్సీ ఉంది. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించి, వాల్తేరు డివిజన్ ఆదాయానికి గండికొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వాల్తేరు డివిజన్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment