కబడ్డీ ఆడుతున్న క్రీడాకారిణులు
విజయనగరం: పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి మొదటిస్థానంలో నిలవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆకాంక్షించారు. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం వస్తుందని హితవు పలికారు. ముఖ్యంగా మహిళలకు ఫిట్‌నెస్ చాలా అవసరమని, అందుకోసం వ్యాయామం చేయాలని, అప్పుడప్పుడూ క్రీడలు ఆడుతూ ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో, కార్పొరేషన్ మహిళా విభాగం సారథ్యంలో మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. నగరంలోని మహిళా పార్కులో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది జట్లు తలపడనున్నాయి.
క్రీడలతో మానసిక దృఢత్వం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆటల వల్ల క్రీడా స్ఫూర్తితో పాటు వినోదం కూడా కలుగుతుందని, మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. 15 ఏళ్ల పైబడిన వారంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అన్ని రకాల క్రీడలను మహిళలు ఆడాలని పిలుపునిచ్చారు. మహిళా పార్కులో మహిళల వ్యాయామం కోసం అనేక రకాల పరికరాలను కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారన్నారు. నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పొటీలలో పాల్గొనేందుకు 8 జిల్లాల నుంచి మహిళలు విచ్చేశారని తెలిపారు . ఈ పొటీలలో మొదటి బహుమతిగా రూ.50వేలు, 2వ బహుమతి రూ.40 వేలు, 3వ బహుమతి రూ.30 వేలు, 4వ బహుమతి రూ.20 వేలు నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ అస్మా ఫరీన్, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, ఏఎంసీ చైర్‌పర్సన్ శశిభార్గవి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
రాష్ట్రస్థాయి మహిళల ఆహ్వానపు కబడ్డీ
పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment