కీచక పర్వంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

కీచక పర్వంపై విచారణ

Published Fri, Sep 27 2024 2:02 AM | Last Updated on Fri, Sep 27 2024 2:02 AM

కీచక

బొబ్బిలి: బాలికలతో స్నేహపూర్వకంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు సంస్కారం మరిచిన వైనంపై డీఎస్పీ పి.శ్రీనివాసరావు బుధవారం విచారణ జరిపి కౌన్సెలింగ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యాశాఖాధికారులు కూడా స్పందించారు. డీఈఓ ఆదేశాల మేరకు బొబ్బిలి డిప్యూటీ ఈఓ మోహనరావు బొబ్బిలి పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలకు గురువారం వెళ్లి విచారణ జరిపారు. ఇద్దరు ఎంఈఓలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపువాసు సమక్షంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వర కు ఉపాధ్యాయులు, విద్యార్థినులను వేర్వేరు గా విచారణ జరిపారు. వారి మాటలను రికా ర్డు చేశారు. సంస్కారం మరిచి ప్రవర్తించిన ఉ పాధ్యాయునికి హెచ్చరికలు జారీ చేశారు. నివే దికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి అధికారిగా ప్రశాంత్‌ కుమార్‌

విజయనగరం అర్బన్‌: జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా గరుడపల్లి ప్రశాంత్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఆయన అల్లూరి సీతారామారాజు జిల్లాలో పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి అధికారిగా పనిచేసిన గోవిందరావు అనకాపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లారు.

జేఎన్‌టీయూ జీవీలో రక్తదానం

విజయనగరం అర్బన్‌: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీ రింగ్‌ విద్యార్థులు గురువారం రక్తదానం చేశా రు. 82 మంది విద్యార్థుల నుంచి 82 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వాస్పత్రి బ్లడ్‌బ్యాంకు సిబ్బంది సేకరించారు. జేఎన్‌టీయూజీవీ ఇంజినీరింగ్‌ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రాజేశ్వరరావు ముందుగా రక్తదానం చేసి అందరి నీ ఉత్సాహపరిచారు. రక్తదాన శిబిరాన్ని వర్సి టీ ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్‌ జి. జయసుమ సందర్శించారు. కార్యక్రమంలో కళాశాల యూనిట్‌–1 ప్రొగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాసులు, యూనిట్‌–2 ప్రొగ్రాం ఆఫీస ర్‌ డాక్టర్‌ బి.ధర్మారావు పాల్గొని విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు సునీల్‌, శిరీ ష, సీహెచ్‌ నందిని, బ్లడ్‌ బ్యాంక్‌ కౌన్సిలర్‌ అప్పలనాయుడు, వైద్య సిబ్బంది, టెక్నీషియ న్లు పాల్గొన్నారు.

అన్నదాతకు

రూ.20 వేలు అందజేయాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు

విజయనగరం ఫోర్ట్‌: అన్నదాతకు పెట్టుబడి సాయం కింద తక్షణమే రూ.20వేలు అందజే యాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంటలకు ఉచిత పంటల బీమాను అమలు చేయాలన్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. వ్యవసా య మోటార్ల మీటర్లు ఏర్పాటుకు సంబంధించిన జీఓ 22 రద్దు చేయాలన్నారు. భూయాజ మాని సంతకంతో పనిలేకుండా వాస్తవ సాగుదారులకు కౌలు గుర్తింపు కార్డులు అందజేసి ప్రభుత్వ రాయితీలు, పథకాలు వర్తింపజేయాలన్నారు. ఎన్‌సీఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీని ప్రభు త్వం స్వాధీనం చేసుకుని క్రషింగ్‌ చేయాలన్నా రు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపినాయుడు, కార్యదర్శి రాకోటి రాములు, రైతు సంఘం నాయకులు గంగునాయుడు, నాగేశ్వరరావు, సూరిదేవుడు, సంతోష్‌, కోటి, గోపాలం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కీచక పర్వంపై విచారణ 1
1/2

కీచక పర్వంపై విచారణ

కీచక పర్వంపై విచారణ 2
2/2

కీచక పర్వంపై విచారణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement