మరుగుదొడ్ల వినియోగం పెరగాలి
విజయనగరం రూరల్: గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికి మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత సచివాలయ కార్యదర్శులపై ఉందని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పిలుపునిచ్చారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎంపీడీఓ తిరుపతిరావు, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే సచివాలయాలకు ప్రతి ఒక్కరూ ఉదయం 9.30గంటలకే హాజరుకావాలని సూచించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గ్రామాల్లో మరుగున పడిన సామూహిక మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment