అప్పుల భారంతో ఆత్మహత్య
బలిజిపేట: మండలంలోని వెంగాపురం గ్రామానికి చెందిన కె.రవి అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై సింహాచలం తెలిపారు. ఈ విషయమై ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె.రవి వృత్తి రీత్యా ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో వేరే మార్గం లేక మంగళవారం సాయంత్రం గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడినుంచి విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment