సందడి చేసిన శ్రీలీల..
విజయనగరం టౌన్: విద్యలనగరంలో సినీనటి శ్రీలీల బుధవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన చెన్నయ్ షాపింగ్ మాల్‌ను జ్యోతిప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అందులోని పట్టు, ఫ్యాన్సీ చీరలు, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, బంగారు, డైమెండ్ ఆభరణాలను పరిశీలించారు. షాపింగ్‌మాల్ యజమానులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షాపింగ్ అంటే చాలా ఇష్టమన్నారు. చీరలపై ఎక్కువగా మక్కువచూపుతానని చెప్పారు. అన్నివర్గాల వారికి అందుబాటు ధరల్లోనే చెన్నయ్ షాపింగ్‌మాల్ వస్త్రాలు అందించడం సంతోషదాయకమన్నారు. విజయ నగరం ప్రజల ఆదరణ మర్చిపోలేనిదన్నారు. రాబిన్ హుడ్ చిత్రంలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని తెలిపారు. చిన్నవయసులోనే క్రేజీ ఉన్న హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం షాపింగ్ మాల్ బయట అభిమానులద్దేశించి కాసేపు మాట్లాడారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ జిల్లా వాసులందరికీ అన్నిరకాల వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయన్నారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ట్రాఫిక్ పోలీస్‌లు బందోబస్తు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో వస్త్రదుకాణ యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నయ్ షాపింగ్ మాల్‌ను
ప్రారంభించిన సినీనటి
శ్రీలీలను చూసేందుకు
తరలివచ్చిన అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment