విజయనగరం కార్పొరేషన్‌కు అవార్డు
విజయనగరం: ఇంధన పొదుపులో విజయగనరం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును సొంతం చేసుకుంది. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–24 పేరిట ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు మిషన్ ఇచ్చే అవార్డుల్లో విజయనగరం కార్పొరేషన్ సిల్వర్ అవార్డును దక్కించుకుంది. ఈ నెల 20న విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డును అందుకునేందుకు రావాలని కమిషనర్‌కు పిలుపు అందింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీలు పోటీ పడగా... విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు సిల్వర్ అవార్డు దక్కడం విశేషం. ఇటీవల ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం అమల్లో గుర్తింపు పొందిన విజయనగరం కార్పొరేషన్‌కు మరో అవార్డు వరించడంపై అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
భక్తి శ్రద్ధలతో కాకడ హారతి
బొబ్బిలి: పట్టణంలోని సింగారపు వీధిలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా మూడో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజారులు కాకడ హారతితో ఆలయ ప్రదక్షిణ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
21న సాగునీటి ప్రాజెక్టు కమిటీల చైర్మన్ ఎన్నిక
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ఐదు సాగునీటి ప్రాజెక్టు కమిటీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. డెంకాడ ఆయకట్టు సిస్టం, ఆండ్ర రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్, పారాది ఆయకట్టు, గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టు స్టేట్–1 లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు జరిగే ఎన్నికల పక్రియలో ఇటీవల సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొని ప్రాజెక్టు కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment