వరుసగా సంభవిస్తున్న తుఫాన్‌లు రైతన్న నడ్డివిరుస్తున్నాయి. పదిరోజుల కిందట వచ్చిన ఫెంగల్ తుఫాన్ వేలఎకరాల్లోని వరి పంటను తడిపేసి నష్టం చేకూర్చింది. సుమారు 1934 మెట్రిక్ టన్నుల ధాన్యం రంగుమారింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతుల్లో వణుకుపుట్టిస్తోంది. బుధవారం చిరుజల్లులు కురవడంతో రైతు కుటుంబాలు పొలానికి పరుగుతీశాయి. పనలుగా ఉన్న చేనును కుప్పలుగా చేర్చాయి. నూర్పిడి చేసిన ధాన్యంను భద్రపరిచే చర్యలు చేపట్టాయి. కొన్నిచోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతన్నలను అప్రమత్తం చేశారు. పనుల్లో భాగస్వాములయ్యారు. వరితో పాటు కూరగాయల పంటల సంరక్షణపై సూచనలిచ్చారు.
– విజయనగరంఫోర్ట్/తెర్లాం/సంతకవిటి/బొండపల్లి/బాడంగి
Comments
Please login to add a commentAdd a comment