రెండు నెలలవుతోంది...
పవన్ కళ్యాణ్ గుర్ల వచ్చారు. మాతో మాట్లాడారు. డయేరియా ఎలా వచ్చిందని అడిగారు. ప్రభుత్వంతో మాట్లాడి అంతా తాను చూస్తానని చెప్పారు. సొంతంగా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తానన్నారు. సుమారుగా రెండు నెలలు అవుతోంది. ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కనీసం సమాచారం కూడా లేదు. – పతివాడ శ్రీనివాసరావు,
గుర్ల, మృతురాలు పతివాడ సూరమ్మ కుమారుడు
ప్రకటించారే తప్ప
పైసా ఇవ్వలేదు
డయేరియాతో నా భర్త చనిపోయాడు. పవన్ కళ్యాణ్, మంత్రి అనిత మా కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామన్నారు. తీరా రెండు నెలలైనా పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.లక్ష రాలేదు. ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు.
– చింతపల్లి అప్పయ్యమ్మ ,
గుర్ల, మృతుడు చింతపల్లి అప్పారావు భార్య
అతీగతీ లేదు
డయేరియాతో భార్య చనిపోయింది. పవన్ కళ్యాణ్ మా కుటుంబానికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు. రూ.లక్ష ఆర్థిక సాయం కూడా చేస్తామన్నారు. జనసేన పార్టీవారు వచ్చి ఆధార్ కార్డులు తీసుకున్నారు తప్ప నేటికీ అతీగతీ లేదు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లుగానే రూ.2 లక్షల చొప్పున సాయం అందించారు. – తోండ్రంగి అప్పారావు,
గుర్ల, మృతురాలు తోండ్రంగి రాము భర్త
●
Comments
Please login to add a commentAdd a comment