గుర్ల: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. గుర్ల మండలం దేవునికణపాకలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించారు. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూములకు పట్టాలు అందజేయాలని, గతంలో ఇచ్చిన పట్టాలకు భూములను చూపాలని కలెక్టర్‌కు గిరిజనులు విన్నవించారు. సమస్యపై వారం రోజుల్లో పూర్తి సమాచారం అందించాలని తహసీల్దార్ పి.ఆదిలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. సదస్సులో ఏఓ తిరుపతిరావు, డీటీ నారాయణమ్మ, సర్వేయర్ శివ, ఆర్‌ఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment