కార్లలో గంజాయి తరలింపు.. నలుగురి అరెస్టు
● రెండు కార్లును సీజ్ చేసిన పోలీసులు ● 18 కిలోల గంజాయి స్వాధీనం
తెర్లాం:
అక్రమంగా రెండు కార్లలో 18 కిలోల గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. తెర్లాం కూడలి వద్ద గల వాటర్ ట్యాంక్ సమీపంలో తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు తన సిబ్బందితో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో రామభద్రపురం నుంచి రాజాం వైపు రెండు కార్లలో వస్తున్నవారు పోలీసులను చూసి మళ్లీ రామభద్రపురం వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఐ, సిబ్బంది వాటిని వెంబడించి రెండు కార్లను పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేస్తే 18 కిలోల గంజాయి బయటపడింది. వాటిలో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారులో ప్రయాణిస్తున్న కొరాపుట్‌కు చెందిన ఇద్దరిలో ఒకరు మైనర్ కాగా, మరొకరు చందన్‌ఘడియాగా గుర్తించాం. 18 కిలోల గంజాయిని 15 ప్యాకెట్లుగా తయారు చేసి కారు వెనుక భాగంలో ఉంచారు. ఈ కారు కొరాపుట్ నుంచి పాచిపెంట మీదుగా ఓ తోటలోకి వచ్చింది. అక్కడ అప్పటికే ఉన్న మరొక కారులోకి 10 కిలోల గంజాయి ప్యాకెట్లను వేరు చేసి పెట్టారు. ఈ కారు హర్యానా రాష్ట్రానికి చెందినదిగా గుర్తించాం. అందులో వీరేంద్రసింగ్, సునీల్‌రాణా ఉన్నారు. గంజాయిని హర్యానాలోని ఓ వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడ్డారు. నలుగురు వ్యక్తులను బొబ్బిలి ఏజెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చాం. వాహనాలను సీజ్‌చేశాం. గంజాయి విలువ రూ.90వేలు ఉంటుంది. సమావేశంలో సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment