ఘనంగా ఉరుసు ఉత్సవం
విజయనగరం టౌన్: స్థానిక కోట్లమాదప్పవీధిలో కొలువైన హజరత్ సయ్యద్ దరియాఖాన్ బాబా అవులియా ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతాలకతీతంగా దర్గా ఆవరణలో మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన జరిపారు. దరియాఖాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సిద్దిక్, షేక్‌బాబా, అజీమ్ అన్వర్ జానీలు మాట్లాడుతూ సయ్యద్ బాబాల దర్గా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
చెరకు రైతులకు సౌకర్యాలు కల్పించండి
రేగిడి: స్థానిక ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారానికి చెరకును తరలిస్తున్న రైతులు, డ్రైవర్లకు సదుపాయాలు కల్పించాలని సుగర్ కేన్ ఉప కమిషనర్ జీవీవీ సత్యనారాయణ యాజమాన్యానికి సూచించారు. చక్కెర కర్మాగారం పరిసరాలను ఆయన గురువారం పరిశీలించారు. అప్పాపురం సర్పంచ్ కరణం శ్రీనివాసరావు ఇటీవల ఇక్కడ రైతులకు సౌకర్యంలేదని ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఉప కమిషనర్ కర్మాగారం పరిసరాలు పరిశీలించారు. గతంలో రైతులకోసం నిర్మించిన విశ్రాంతి భవ నం పరిశీలించి, వినియోగంలోకి తీసుకురావాలని యాజమాన్యానికి సూచించారు. మరుగుదొడ్లు, సాగునీరు తదితర వాటిని వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
20 నుంచి ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ సంస్థ అందిస్తున్న కార్గో సేవలను డోర్ డెలివరీ స్థాయికి వివరించే లా ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాలో మాసో త్సవాలను నిర్వహిస్తామని ఆర్టీసీ సంస్థ జిల్లా రవాణా అధికారి సీహెచ్ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 90 పట్టణ కేంద్రాల్లో తొలి విడతగా ఈ సేవలను విస్తరిస్తున్నారని, అందులో విజయనగరం పట్ట ణం ఉందని తెలిపారు. సమీప బుకింగ్ కౌంటర్ నుంచి పది కిలోమీటర్ల వరకు 50 కిలోల బరువు గల పార్సిళ్లను ఇంటికే తెచ్చి అందజేస్తామని చెప్పారు. పట్టణ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
● విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
సురగాల లక్ష్మణ్
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ అన్నారు. చండీగడ్‌లో విద్యుత్ సంస్థల ప్రతిపాదిత ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో దాసన్నపేట విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, చండీగడ్ తర్వాత ఏపీలో కూడా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. దీనిని విద్యుత్ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధర్నా అనంతరం ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ కన్వీనర్ బండారురాజేష్, ఉపాధ్యక్షుడు పి.అప్పలస్వామినాయుడు, బి.కె.వి.ప్రసాద్‌రావు, సీతారామరాజు, ఎల్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
దరియాఖాన్ బాబా దర్గాలో ప్రత్యేకప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
Comments
Please login to add a commentAdd a comment