పారిశుద్ధ్య కార్మికులకు ష్యూరిటీలేని రుణాలు
విజయనగరం అర్బన్: సఫాయి కర్మచారి (పారిశుద్ధ్య కార్మికులు)లకు ష్యూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డాక్టర్ పీపీ వావా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సఫాయి కర్మచారిలకు విధిగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అందుతున్న పథకాలు, సామాజిక, విద్యా, ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. కార్మికులు చనిపోయిన వెంట నే కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల కు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. కార్మికుల కు అవసరమైన దుస్తులు, బూట్లు, చేతి గ్లౌవ్స్, నూనె తదితర సామగ్రిని అందజేయడంపై సంతో షం వ్యక్తం చేశారు. ఆదాయాలకు అతీతంగా కార్మికులకు ప్రభుత్వం ఇళ్లు, రేషన్ కార్డులను మంజూరు చేయాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అదనపు ఎస్పీ సౌమ్యలత, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి రామానందం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణమూర్తి, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్రహ్మణ్మం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు, విజ యనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లు నల్లనయ్య, అప్పలనాయుడు, రామ లక్ష్మి, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment