స్వచ్ఛ క్యాంపస్‌లో భాగంగా విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను గురువారం ఏరివేశారు.
ఈ బృహత్తర ప్రక్రియలో వీసీ కట్టిమణితో పాటు ప్రొఫెసర్లు, విద్యార్థులు భాగస్వాములయ్యారు. సేకరించిన వ్యర్థాలను విజయనగరం మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వర్సిటీ శుభ్రత, సుస్థిర పర్యావరణానికి ప్రతి విద్యార్థి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. వివిధ పరిశుభ్రత డ్రైవ్‌లలో చురుగ్గా పాల్గొన్న టీచింగ్, నాన్ టీచింగ్ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమం కంప్యూటర్స్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ బొంతు కోటయ్య ఆధ్వర్యంలో సాగింది. – విజయనగరం అర్బన్
స్వచ్ఛ క్యాంపస్
Comments
Please login to add a commentAdd a comment