క్షయ రహిత జిల్లాయే లక్ష్యం
● కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత జిల్లాయే లక్ష్యంగా వంద రోజుల క్షయ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 10 వాహ నాల ద్వారా క్షయ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 779 క్షయ వ్యాధి నిర్ధారణ, వైద్యపరీక్షల శిబిరాలు నిర్వహించినట్టు వెల్లడించారు. క్షయవ్యాధి ప్రచార, నిర్మూలనా కార్యక్రమంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యద ర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ, అడిషనల్ సెక్రట రీ అరాధనా పట్నాయక్, టీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఊర్వశి బిసింగ్, టీబీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్‌రావ్‌లు గురువారం జాతీ య స్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన క్షయ నివారణ చర్యలను వివరించారు. క్షయ రోగులకు పౌష్టికాహార కిట్లను అందజేస్తున్నా మని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment