చేపల ఉత్పత్తిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
పార్వతీపురం: జిల్లాలో చేపల పెంపకందారులు ఆర్థికాభివృద్ధి సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుపై శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో చేపల సంపద అభివృద్ధి జరగాలని, మత్స్య సంపద ద్వారా సంవత్సరానికి కేవలం రూ.194 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరుతోందన్నారు. చేపల పెంపకంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 96 వేల మంది ఆధారపడుతున్నారని, చేపల పెంపకంపై మత్స్యకారుల్లో ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్యకు సూచించారు. జిల్లాలో ఉన్న పంచాయతీల్లో సుమారు 1800 చెరువులు ఉన్నాయని వాటిని చేపల పెంపకందారులు సద్వినియోగం చేసుకుని, చేపల పెంపకం పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫిషరీస్ స్టేట్ కో ఆర్డినేటర్ కె.గంగాధర్, డీఆర్‌డీఏ ఏపీఎం కె.భారతి, స్వచ్ఛ సుందర పార్వతీపురం ట్రస్ట్ సభ్యులు పద్మజ, పునర్వి ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థ సీఈఓ హేమంత్, ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘ వైస్‌చైర్మన్ దాసరి లక్ష్మణ్, ఎఫ్‌డీఓలు, మత్స్యకార సంఘం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment