చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ113 శ్రీ196 శ్రీ206
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి తీపిపదార్థాలు, పండ్లతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించారు.
సీనియర్ మహిళల కబడ్డీలో పట్టణ విద్యార్థిని ప్రతిభ
విజయనగరం అర్బన్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఇటీవల జరిగిన 71వ ఆంధ్ర సీనియర్ పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో విజయనగరం మహిళల జట్టు ద్వితీయస్థానం సాధించాయి. ఆ జట్టులో సత్య కళాశాల విద్యార్థిని బి.నీలిమ విజయంలో కీలకపాత్ర వహించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను కళాశాల యాజమాన్యం అభినందించింది.
290 మద్యం బాటిల్స్ స్వాధీనం
గుర్ల: మండలంలోని కోటగండ్రేడులో 290 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒక వ్య క్తిని ఆరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ రావు మంగళవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా 290 మద్యం బాటిల్స్ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.
మెంటాడలో 122 మద్యం బాటిల్స్
మెంటాడ: అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తినుంచి 122 మద్యం సీసాలను పట్టుకున్నట్లు మెంటాడ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ మేరకు మండలంలోని అమరావలస నుంచి జయతి గ్రామం మధ్య టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో 122 మద్యం సీసాలను తీసుకువెళ్తున్న వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకోవడంతో పాటు వ్యక్తి దగ్గర ఉన్న 122 మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు.
బొబ్బిలిలో 80 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సీసాలను బెల్ట్ షాపులకు తరలిస్తుండగా ఎస్సై ఆర్.రమేష్ సిబ్బందితో దాడి చేసి ఓవ్యక్తిని మంగళవారం పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్‌ల మధ్య సారిక గ్రామసమీపంలో రైల్వేట్రాక్‌పక్కన అనుమానాస్పదరీతిలో మహిళ మృతి చెందినట్లు గుర్తించామని జీఆర్‌పీ ఎస్సై వి.బాలాజీరావు మంగళవారం తెలిపారు. మహిళ మృతదేహం పడి ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తుకలిగి, ఛామనచాయ రంగు, తెలుపురంగుపై నలుపు రంగు పువ్వులు కలిగిన టాప్, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉందన్నారు. అకస్మాత్తుగా రైల్లోంచి జారిపడిపోయిందా? ఇంకేమైనా జరిగి ఉంటుందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించామని ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment