చిన్నారులపై కీచక ప్రిన్సిపాల్ వికృత చేష్టలు
వీరఘట్టం: ‘గురుబ్రహ్మ’... గురువిష్టు.. గురుదేవో మహేశ్వర అని ప్రతి రోజు ఆ బాలికలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీరఘట్టంలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ వారి పాలిట కామాంధుడిగా మారాడు. గత కొన్ని రోజులుగా 4, 5, 6 తరగతులు చదువుతున్న బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం ఇంటిలో చెబితే తోలు తీసేస్తానని బెదిరించడంతో.. పాపం ఆ చిన్నారులు కొంతకాలంగా ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులను భరించారు. ఆయన వికృత చేష్టలను సమీపంలోని ఓ ఇంటిలో తాపీపని చేస్తున్న మేసీ్త్రలు శుక్రవారం గుర్తించారు. వెంటనే ఫొటోలు తీసి పిల్లల తల్లిదండ్రులకు చూపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వీరఘట్టంలోని ఆ పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జి.కళాధర్, పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాఠశాల కు చేరుకుని చిన్నారులను విచారణ చేశారు. ప్రిన్సిపాల్ వారిపై వ్యవహరిస్తున్న తీరును చిన్నారులు చెబుతుంటే చలించిపోయారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువే చీడపురుగుగా మారాడంటూ స్థాని కులు దుమ్మెత్తి పోశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ తెర్లి సింహాచలంపై పోక్సో కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఆ పాఠశాలలో మరి చదివించం
ప్రిన్సిపాల్ తీరుతో ఆ పాఠశాలలో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పోలీసుల ముందే పాఠశాల నుంచి మా పిల్లలను తీసుకెళ్లిపోతామని చెప్పారు. గురుభావంతో పిల్లలను సాకాల్సిన ప్రిన్సిపాల్ తీరును దుమ్మెత్తిపోశారు. ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు.
ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆలస్యంగా
వెలుగుచూసిన లైంగిక వేధింపులు
ఉలిక్కిపడిన వీరఘట్టం
ప్రిన్సిపాల్‌పై పోక్సోకేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment