ఉన్నత లక్ష్యంతో భవిత బంగారం
శృంగవరపుకోట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటిని సాధించే దిశగా చదువు సాగిస్తే భవిష్యత్తు బంగారం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. కిల్తంపాలెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ వి.దుర్గాప్రసాద్ స్కూల్ సాధించిన లక్ష్యాలను జేసీకి వివరించారు. ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ పాఠశాల పరిసరాలను, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులను పోటీ పరిక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
జేసీ సేతుమాధవన్
Comments
Please login to add a commentAdd a comment