పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధికల్పన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్ట ర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ చదువుకుని, 18 నుంచి 32 ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత హెచ్‌టీటీపీఎస్: //నైపుణ్యం.ఏపీ.జీఓవీ. ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్‌తో బయోడేటా, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్‌ను తీసుకుని జాబ్‌మేళాకు ఉదయం 9 గంటలకు హజరుకావాలని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ 6301275511 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment