పత్ర కషాయంతో చీడపీడలకు చెక్
మొక్కజొన్న, మామిడి తోటలను ఆశించే చీడపీడలను వివిధ రకాల ఆకులతో తయారుచేసిన కషాయంతో నివారించవచ్చని ఏపీ కమ్యూనిటీ నేచరల్ ఫారమ్స్ (ఏపీసీఎన్‌ఎఫ్) డీపీఎం ఆనందరావు, మండల వ్యవసాయ అధికారి జి.సునీల్‌కుమార్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు విధానాలపై తెర్లాం మండలంలోని పెదపాలవలస రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. కషాయాల తయారీని ప్రయోగాత్మకంగా వివరించారు. చింత, జిల్లేడు, జామ, ములగ, సీతాఫలం, కలబంద, ఆముదం, నల్లేరు, కాగు, వేప ఆకులు, వరి గడ్డి, పచ్చిజొన్నగడ్డి, గుంటకలవ ఆకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చితో చేసిన ముద్దను ఆవు మూత్రంతో కలిపి వారం రోజులపాటు డ్రమ్ముల్లో ఊరబెట్టాలన్నారు. దీనిని పంటలపై పిచికారీ చేస్తే చీడపీడల నుంచి పంటను రక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ ఆదిలక్ష్మి, ఏపీసీఎన్‌ఎఫ్ ఐసీఆర్‌టీలు దమయంతి, భాగ్యం, రమాదేవి పాల్గొన్నారు. – తెర్లాం
Comments
Please login to add a commentAdd a comment