కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ

Published Wed, Jan 8 2025 12:39 AM | Last Updated on Wed, Jan 8 2025 12:39 AM

కొనసా

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ

విజయనగరం క్రైమ్‌: స్టైపెండరీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కొనసాగాయి. 600 మందికి 351 మంది హాజరైనట్లు ఎస్పీ వకుల్‌ జిందల్‌ తెలిపారు. నియామక ప్రక్రియను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, యూనివర్స్‌, ఎం.వీరకుమార్‌, ఎస్‌.బాపూజీ, టి.ఎన్‌.శ్రీనివాసరావు, కె.థామస్‌ రెడ్డి, ఏఓ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పీఈటీలు పర్యవేక్షించారు.

ఐసీటీతో జేఎన్‌టీయూ జీవీ ఒప్పందం

విజయనగరం అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం చైన్నెయ్‌లో స్థాపించిన ఐసీటీ అకాడమీతో జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) నైపుణ్యాల అభివృద్ధిపై మౌలిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్‌ డి.రాజ్యలక్ష్మి మాట్లాడారు. మానవ వనరుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఐసీటీ అకాడమీ సహకరిస్తుందన్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించి అకడమిక్‌, పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్‌, ఐసీటీ అకాడమీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.సరవణన్‌, రాష్ట్ర ప్రతినిధి దినకర్‌ రెడ్డి సంతకాలు చేసి అంగీకార పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో అకడమిక్‌ ఆడిట్‌ డైరెక్టర్‌, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రాజేశ్వరరావు, పరిశ్రమ సంబంధాలు, ప్లేస్‌మెంట్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.జె.నాగరాజు, విశాఖ ప్రాంత సంబంధాల మేనేజర్‌ యాకాల సురేష్‌, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు

డీఎంహెచ్‌ఓ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: హెచ్‌ఎంపీవీ (హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌) పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి చెప్పారు. కోవిడ్‌ సమయంలోని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తన చాంబర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్‌ఎంపీవీపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు ధరించడం, చేతుల శుభ్రత, సమూ హాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలకు 24 గంటలూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాన్నారు. ప్రాణాంతకమైన కేన్సర్‌ను త్వరితగతిన గుర్తించగలిగితే నయం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. చాలా మంది కేన్సర్‌ 3, 4 స్టేజ్‌ల వరకు గుర్తించలేకపోతున్నారన్నారు. ఆమె వెంట డాక్టర్‌ కె.రాణి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ 1
1/2

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ 2
2/2

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement