పాదయాత్రగా అప్పన్న సన్నిధికి..
మేళతాళాలు.. భక్తి గీతాలాపనలు, భజనలు నడుమ విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి (సింహాద్రి అప్పన్న) దేవస్థానానికి సుమారు రెండువేల మంది భక్తులు కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటబుల్‌ట్రస్టు నుంచి మంగళవారం పాదయాత్రగా వెళ్లారు. ఒడిశా, అరకు, విజయనగరం, విశాఖపట్నానికి చెందిన భక్తులు సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏటావలే పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్టు ట్రస్టు చైర్మన్ జగదీష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, వెంగమాంబ భజనబృందం సభ్యులు పాల్గొన్నారు. – కొత్తవలస
Comments
Please login to add a commentAdd a comment