అవగాహనతో సైబర్‌నేరాల నియంత్రణ
విజయనగరం క్రైమ్: అవగాహనతోనే సైబర్ నేరాలను నియంత్రించడం సాధ్యమని, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై రూపొందించిన లఘుచిత్రం వాల్‌పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసగాళ్లు కాల్స్, లింక్స్, వీడియో కాల్స్‌తో ప్రజలకు ఎరవేసి, భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సైబర్ నేరగాళ్లు ముందుగా ఫోన్‌చేసి వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలను తెలిపి, దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు, పిల్లలు పోలీసుకేసులో ఇరుక్కున్నారని, కొరియర్ చేసిన ప్యాకింగ్‌లో మాదక ద్రవ్యాలను విదేశాలకు పంపిస్తున్నట్లు నిర్ధారణ అయిందని, ఫేక్ పాస్‌పోర్టులు, బంగారం బిస్కెట్లు ఉన్నాయని, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదుచేశామని, విచారణ నిమిత్తం తాము సూచించిన ప్రాంతానికి దర్యాప్తు నిమిత్తం రావాల్సి ఉంటుందని సమాచారం అందించి భయభ్రాంతులకు గురిచేస్తారన్నారు. సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టూల్స్‌ను వినియోగించి యానిమేషన్ పాత్రలను సృష్టించి షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించామన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు చేరువచేయనున్నామని, ఫిల్మ్ రూపొందించడంలో క్రియాశీలకంగా పనిచేసిన సోషల్ మీడియాసెల్ కానిస్టేబుల్ బి.రాంబాబును ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ ఎ.వి.లీలారావు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment