రక్తదాతా సుఖీభవ...
ఆయన విద్యాబుద్ధులు నేర్పే గురువే కాదు.. ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేసి ఆదుకునే
మంచి మాస్టార్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే తెర్లాం మండలం నందబలగ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
విజయమోహనరావు. ఆయనను ఎంఈఓ జె.త్రినాథరావు, ఉపాధ్యాయులు పాఠశాలలో
మంగళవారం సత్కరించారు. రక్తదాతా సుఖీభవ అంటూ ఆశీర్వదించారు. 100 సార్లు రక్తదానం చేయడమే తన లక్ష్యమని వియజయోహనరావు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. – తెర్లాం
Comments
Please login to add a commentAdd a comment