ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా రేపు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, గవర్నమెంట్ ఐటీఐ కళాశా ల విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధికల్పనలో భాగంగా ఎస్‌ఎస్ సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 35 సంవత్సరాల వయసులోపు ఉన్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. జాబ్ మేళాలో సేఫ్ డ్రైవ్ ప్లస్, హెటిరోడ్రగ్స్ తదితర బహుళ జాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు తమ వివరాలను ‘నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకుని అడ్మిట్ కార్డుతోపాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికె ట్లు ఒరిజినల్, జిరాక్స్, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో ఆ రోజు ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రాంగణానికి హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్: 79956 91295, టోల్ ఫ్రీ: 9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
టీచర్లకు జీతాలు, ఆర్థిక
బకాయిలు చెల్లించాలి
● ఎస్‌టీయూ జిల్లా కమిటీ డిమాండ్
విజయనగరం అర్బన్: టీచర్లకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, సకాలంలో జీతాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరి శీలకుడు ఎస్‌వీరమణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలోని అమర్ భవనంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక అవసరాలకు దరఖాస్తు చేసుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవులు, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. యాప్‌ల భారం తగ్గించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ కమిటీ వేసిన ఐఆర్ ప్రకటించాలని కోరారు. అనంత రం ముఖ్యఅతిఽథిని జిల్లా కమిటీ సభ్యులు సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముద్దంశెట్టి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.చిట్టిబాబు,ఎంఏస్వామి, జిల్లా కార్యదర్శులు ఎస్.బంగారయ్య, జి.రవి, టి.నాగేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శి బి.ఈశ్వరరావు, కేవీఎల్‌నాగేశ్వరి, అడివయ్య, సీతారా మ్, మల్లేశ్వరరావు, పి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
కళ్లికోటకు చేరుకున్న
ఏనుగుల గుంపు
కొమరాడ: గడిచిన నెలరోజులుగా గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో సంచిరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం కొమరాడ మండలంలోని కళ్లికోట, గారవలస గ్రామ సమీపంలోకి చేరుకుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఎక్కువగా ఉండడంతో చేతికివచ్చిన టమాటో, అరటి తదితర కూరగాయల పంటలతోపాటు జొన్న, కళ్లాల్లో ఉన్న ధాన్యం ధ్వంసం చేస్తాయోమోనన్న భయంతో ఉన్నారు. ఏనుగుల గుంపును తరలించడంపై అటవీశాఖాధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించి కొండ ప్రాంతాల వైపు ఏనుగుల గుంపును తరలించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
షటిల్ బ్యాడ్మింటన్‌లో
రాణించిన వైద్యులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల లో వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఆదివారం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బర్ల అజయ్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ (రేడియాలజీ) ప్రసాదరావు ప్రథమస్థానంలో నిలిచారు. వీరికి ప్రభు త్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మలీ ల, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగిఅప్పలనాయుడు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment