ఆ చిరుద్యోగుల మొర ఆలకించేదెవరు? వారు ఏ భగవంతుడికి నివేద
విజయనగరం ఫోర్ట్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో నియమితులయ్యారనే అక్కసుతోఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మేట్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న మేట్లను తొలగించి వారి స్థానంలో కూటమికి చెందిన సానుభూతిపరులను నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 8,864 మంది మేట్లు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 8864 మంది మేట్‌లు పనిచేస్తున్నారు. వారిలో 7963 మంది మహిళా మేట్‌లు ఉన్నారు. 50 నుంచి 100మంది వేతనదారులకు ఒక మేట్ చొప్పన నియమించారు. 10వతరగతి చదివి, సొంత స్మార్ట్‌ఫోన్ కలిగి ఆపరేటింగ్ తెలిసి న వారిని నియమించారు. దీంతో వారు వేతనదా రులకు ఆన్‌లైన్‌లో హాజరు సులువుగా వేసేవారు. పని ప్రదేశానికి వేతనదారులను మేట్‌లు రప్పించి వారికి హాజరు వేసేవారు.
అనుకూలురు ద్వారా నిధులు కొల్లగొట్టే యత్నం
ప్రస్తుతం ఉన్న మేట్లను తొలగించి తమ అనుకూలురును మేట్‌లుగా నియమించుకుని వారి ద్వారా ఉపాధి నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము నియమించుకున్న మేట్‌ల ద్వారా బినామీ మస్టర్లు వేసుకుని కూటమి నేతలు జేబులు నింపుకోవడానికి మేట్‌ల ను మార్పు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో జాబ్ కార్డులు 3.84 లక్షలు
జిల్లాలో జాబ్ కార్డులు 3.84 లక్షలు ఉన్నాయి. వాటిలో యాక్టివ్ జాబ్‌కార్డులు 3.52 లక్షలు. వేతనదారులు జిల్లాలో 6.86 లక్షల మంది ఉన్నారు. వారిలో యాక్టివ్‌గా ఉండే వేతనదారులు 5.94 మంది ఉన్నారు.
కుట్ర పన్నుతున్న కూటమి సర్కారు !
ప్రస్తుతం పని చేస్తున్న వారి స్థానంలో కొత్తవారు
నియామకానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ హయాంలో
నియమితులయ్యారని అక్కసు
కూటమి సానుభూతి పరులను
నియమించి నిధులు కొల్లగొట్టే యత్నం
పాత వారి స్థానంలో కొత్తవారు
ప్రస్తుతం పనిచేస్తున్న మేట్లను తొలగించి వారి స్థానంలో కొత్త మేట్‌లను నియమించనున్నారు. కొత్తగా వచ్చిన మార్గ దర్శకాల్లో మేట్‌కు చదవడం, రాయడం వస్తే చాలు అని పేర్కొన్నారు. సొత మొబైల్ ఫోన్‌తో పాటు 50 ఏళ్లలోపు ఉండాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
కొత్త మేట్ల నియామకం వాస్తవమే
ఉపాధి హామీ పథకంలో కొత్తగా మేట్‌లను నియమించుకోమని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. నిబంధనలకు అనుగుణగా మేట్‌లను నియమించనున్నాం.
–ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా
Comments
Please login to add a commentAdd a comment