ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● గురుకులం జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
నెల్లిమర్ల: పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 14 పాఠశాలల నుంచి విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. పోటీలను కన్వీనర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కేబీబీ రావు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. క్రీడాకారులు ముందుగా మార్చ్‌ఫాస్ట్ చేశారు. ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎస్‌ఎంసీ చైర్మన్ అంబళ్ల ప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. వాలీబాల్ పోటీలలో టెక్కలి, తానాం టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. అలాగే టెన్నికాయిట్ పోటీలలో పలాస, గంట్యాడ టీమ్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా తొలిరోజు నిర్వహించిన కబడ్డీ, ఖోఖో పోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు కామేశ్వరి, సూర్యారావు, మోహన్, ఆనంద్, సీత, దమయంతి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment