అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
డెంకాడ: అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి జీవన్‌రాణి అన్నారు. డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. వైద్యారోగ్య శాఖద్వారా అమలు జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై పీహెచ్‌సీ డాక్టర్ శివరామకృష్ణ, సిబ్బందితో చర్చించారు. డెంకాడ గ్రామంలో పిల్లలకు వ్యాక్సిన్‌లు వేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడూతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. అంటువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, జాగ్రత్తలు వివరించడం ద్వారా చాలావరకూ వాటిని నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రాజు, అనిల్‌కుమార్, సూరి అప్పారావు, యాసయ్య, అప్పలనాయుడు, మీనాకుమారి, గోవింద, దుర్గారావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ జీవన్ రాణి
Comments
Please login to add a commentAdd a comment