హెచ్ఎంపీవీపై అలెర్ట్
కామన్ కోల్డ్ లాంటిది
హెచ్ఎంపీవీ కామన్ కోల్డ్ లాంటిది. భయపడాల్సిన అవసరం లేదు. ముందుస్తు చర్యల్లో భాగంగా సర్వజన ఆస్పత్రిలో 10 పడకల వార్డును, మందులను సిద్ధం చేశాం. కోవిడ్‌కు తీసుకున్నట్టు గానే ఈవైరస్ నివారణకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పిల్లలు, వృద్ధులు, హైరిస్క్ గ్రూపు వారు అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్, పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
విజయనగరం ఫోర్ట్: హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు దేశంలో నమోదుకావడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి గ్రస్తులకు చికిత్స అందించడం కోసం ముందుస్తు చర్యగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 10 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసింది. ఆస్పత్రిలో కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన హై ఫ్లోన్యాసల్ కాన్యులా (నిమషంలో 60 లీటర్ల ఆక్సిజన్ అందించే) వాటిని సిద్ధం చేసింది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచింది. వదంతులు నమ్మవద్దని, ఇది ప్రాణాంతకం కాదని, సాధారణ ఫ్లూ వైరస్ లక్షణాలే కనిపిస్తాయని తెలియజేసింది.
వైరస్ లక్షణాలు
జ్వరం, గొంతునొప్పి, ముక్క దిబ్బడ, ఆయాసం వంటివి వైరస్ లక్షణాలు. వైరస్ సోకిన వారికి రిబార్విన్, అజిత్రో మైసిన్ లాంటి మందులతో చికిత్స అందిస్తారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. హైరిస్క్ గ్రూపులకు చెందిన హెచ్ఐవీ, క్షయ, డయాలసిస్ రోగులు, సీఓపీడీ, ఆస్తమా రోగులు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేతులు పరిశుభ్రత పాటించాలి.
మాస్క్‌లు ధరించాలి.
బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం చేయకూడదు.
వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
సర్వజన ఆస్పత్రిలో 10 పడకల వార్డు ఏర్పాటు
మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసిన అధికారులు
వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment