అంగన్‌వాడీలకు అందని జీతాలు
● ఐసీడీఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులదీ
ఇదే పరిస్థితి
● పండగ ఎలా జరుపుకోవాలో తెలియని దుస్థితి
● జిల్లాలో 2,499
అంగన్‌వాడీ కేంద్రాలు
● వీటిలో పనిచేస్తున్న 4,684 మంది
కార్యకర్తలు, ఆయాలు
విజయనగరం ఫోర్ట్:
ఐసీడీఎస్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు జనవరి నెల 8వ తేదీ వచ్చినా జీతాలు అందలేదు. సంక్రాంతి పండగకు చేతిలో డబ్బులులేక అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, వివిధ విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పండగ పూట అప్పుతిప్పలు తప్పేలా లేవని వాపోతున్నారు. జిల్లాలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిపి 4,684 మంది వరకు పనిచేస్తున్నారు. మరో 20 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ జనవరి 2, 3 తేదీల్లో పడాల్సిన జీతాలు ఇప్పటివరకు ఖాతాలకు జమకాలేదు. ఐసీడీఎస్ పీడీగా పనిచేసిన బి.శాంతకుమారి సెలవు పెట్టడంతో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఫైల్‌పై సంతకాలు కాలేదు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణికి ఇన్‌చార్జి పీడీగా బాధ్యతలు అప్పగించినా ఆమెకు చెక్ పవర్ ఇవ్వలేదు. ప్రతినెలా 26వ తేదీలోగా అంగన్‌వాడీ జీతా లకు సంబంధించిన బిల్లులను అధికారులు పెడితే మరుసటినెల 2,3 తేదీల్లో జీతాలు అందుతాయి. ఇన్‌చార్జి డిజిటల్ సిగ్నేచర్ ఆథరైజేషన్ ఇవ్వక పోవడం వల్ల బిల్లులు పెట్టడానికి వీలులేని పరిస్థితి. ఇదే విషయంపై ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ సుధారాణి మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు అందని మాట వాస్తవమేనన్నారు. తన డిజిటల్ సిగ్నేచర్ ఆథరైజేషన్ కోసం ఉన్నతాధికారులకు లేఖరాశామని, ఎలాంటి అనుమతిరాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment