శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి | - | Sakshi
Sakshi News home page

శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి

Published Thu, Jan 9 2025 1:14 AM | Last Updated on Thu, Jan 9 2025 1:14 AM

శతశాత

శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి

విజయనగరం ఫోర్ట్‌: గర్భిణులు, పిల్లలకు శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి ఆదేశించారు. స్థానిక అరుంధతీనగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు అందజేయాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ వైద్యులు అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

మర్యాద పూర్వక కలయిక

విజయనగరం అర్బన్‌: జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కె.శ్రీనివాసరావు బుధవారం ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు క్యాంపు కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో స్థితిగతులపై చైర్మన్‌ సమీక్షించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ, పదోతరగతి విద్యార్థులకు రానున్న పరీక్షల కోసం చేస్తున్న సన్నద్ధతపై ఆరా తీశారు. పీవీటీజీ గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కులు, భూ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయనను కలిసిన వారిలో వసతి గృహ సంక్షేమ అధికారి సంతోష్‌ కుమార్‌, హాస్టల్‌ వార్డెన్లు పాల్గొన్నారు.

ఆటో బోల్తా : ఐదుగురికి గాయాలు

భోగాపురం: మండలంలోని రాజాపులోవ గ్రామం హైవే జంక్షన్‌ వద్ద విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న పాసింజర్‌ ఆటో డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

వెంకన్న హుండీల

ఆదాయం రూ.3.51లక్షలు

గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆల య హుండీల నుంచి 72 రోజులకు రూ. 3,51,594లు, కోదండరామాలయంలోని హుండీల నుంచి రూ.12,490లు ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. వి. సూర్యనారాయణ బుధవారం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి 1
1/1

శతశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement