80 శాతం ధాన్యం సేకరణ
తెర్లాం: జిల్లాలో 80 శాతం మేర ధాన్యం సేకరణ పూర్తయిందని జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు తెలిపారు. తెర్లాంలో స్థానిక విలేకరుతో ఆయన బుధవారం మాట్లాడారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. జిల్లాలో ఎస్.కోట, విజయనగరం మండలాల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమవుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో 56 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇంత వరకు 28,548 హెక్టార్లలో పంటలు సాగు చేయడం పూర్తయిందన్నారు. వీటిలో 9,599 హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో పెసలు, 11,598 హెక్టార్లలో మినుము, 144 హెక్టార్లలో వేరుశనగ, 460 హెక్టార్లలో రాగులు, 80 హెక్టార్లలో వరి పంటను రైతులు సాగుచేశారని తెలిపారు. జిల్లాలోని కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరుకు ఈ నెల 7 నుంచి 9 వరకు బ్యాంకు బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 18వేల మంది కౌలు రైతులు ఉండగా, 12,800 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏఓ జి.సునీల్‌కుమార్ ఉన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు
Comments
Please login to add a commentAdd a comment