గడ్డిమందు తాగి విద్యార్థికి అస్వస్థత
తెర్లాం: తోటి విద్యార్థుల ట్యాబ్‌లు తన బ్యాగ్‌లో ఉండడాన్ని చూసిన హాస్టల్ విద్యార్థులు వార్డెన్‌కు, పాఠశాల ఉపాధ్యాయులకు చెబుతారనే భయంతో మనస్తాపానికి గురైన తెర్లాం బీసీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి రాకేష్ గడ్డిమందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి హాస్టల్ సిబ్బంది, బాధిత విద్యార్థి బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాకేష్ ఈ ఏడాదే తెర్లాం బీసీ హాస్టల్‌లో చేరాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీన పాఠశాలకు వచ్చిన రాకేష్ పాఠశాల ముగిసిన వెంటనే తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయాడు. అయితే రాకేష్ బ్యాగ్‌లో వేరే విద్యార్థుల ట్యాబ్‌లు ఉండడాన్ని హాస్టల్‌లోని కొంతమంది విద్యార్థులు చూశారు. తన దగ్గర ట్యాబ్‌లు ఉన్నాయన్న విషయం వార్డెన్‌కు, పాఠశాల ఉపాధ్యాయులకు వారు చెబుతారని భయపడ్డాడు. తన బ్యాగ్‌లో ట్యాబ్‌లు ఉన్న విషయం వార్డెన్‌కు, ఉపాధ్యాయులకు తెలిస్తే ఏమవుతుందోనని భయపడి పురుగు మందులు విక్రయించే దుకాణానికి వెళ్లి గడ్డి మందు కొనుగోలు చేసి హాస్టల్‌కు తెచ్చి స్నానాల గదిలోకి వెళ్లి తాగేశాడు. గడ్డిమందు తాగిన కొంతసేపటికి వాంతులు చేసుకోవడంతో మిగిలిన విద్యార్థులు చూసి హాస్టల్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వెంటనే హాస్టల్ సిబ్బంది రాకేష్‌ను తెర్లాంలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా అక్కడి వైద్యసిబ్బంది ప్రథమచికిత్స చేసి మెరుగైన వైద్యసేవల నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం రాకేష్ సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నాడు. విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉందని హాస్టల్ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment