తహసీల్దార్ తీరు సరికాదు
గజపతినగరం: తప్పును ప్రశ్నించిన సర్పంచ్‌పై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేయడం, అందరి ముందు అవమానించడం సరికాదని గజపతినగరం జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బూడి వెంకటరావు అన్నారు. తక్షణమే మధుపాడ గ్రామ సర్పంచ్‌కు క్షమాపణలు చెప్పాలని తహసీల్దార్ బి.రత్నకుమార్‌ను డిమాండ్ చేశారు. గజపతినగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామానికి సంబంధించిన అక్రమ కల్వర్టు నిర్మాణ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. గ్రామానికి ప్రథమపౌరుడైన సర్పంచ్‌ను మర్యాదగా బయటకు పొమ్మని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. తహసీల్దార్ తీరు పంచాయితీ వ్యవస్థకే ఓ మచ్చగా పేర్కొన్నారు. తహసీల్దార్ ఆడిన మాటలను వెనక్కి తీసుకొని సర్పంచ్‌కు క్షమాపణ చెప్పకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కందితిరుపతి నాయుడు, సీనియర్ నాయకుడు కరణం ఆదినారాయణ, మధుపాడ, తుమికాపల్లి, కాలంరాజుపేట, పీఎస్సార్ పురం, కె.ఎస్.ఆర్.పురం, బంగారమ్మపేట, రంగుపురం గ్రామాల సర్పంచ్‌లు కడుపుట్ల పైడిపునాయుడు, బెల్లాన త్రినాథరావు, గేదెల ఈశ్వరరావు, గిడిజాల కామునాయుడు, ఇ.పైడిపునాయుడు, బి.సత్తిబాబు, కర్రిలక్ష్మణ,
కె.చిన్నపైడన్న, పాండ్రంకి సూర్యప్రకాష్, లోగిశ బంగారునాయుడు, పి.సూరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
తప్పును ప్రశ్నించిన సర్పంచ్‌ను
తూలనాడడంపై మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment