● ఎకై ్సజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
● ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
విజయనగరం అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం ఉందని, వీటిని వెంటనే నియంత్రించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో మద్యం బెల్టు షాపుల నిర్వహణపై సాక్షి దినపత్రిలో వరుసగా వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయన్న సమాచారం తన వద్ద ఉందని, వాటిని ఎకై ్సజ్ శాఖ నియంత్రించలేని పక్షంలో చర్యలు చేపట్టాల్సి వస్తుందన్నారు. జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎకై ్సజ్ శాఖపై సమీక్షించారు. పలుచోట్ల మద్యం దుకాణాల వద్దే బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, అటువంటి దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment