![రోగి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07vzg17-370049_mr-1738955458-0.jpg.webp?itok=og7JltoQ)
రోగి బంధువులే వార్డు బాయ్‌లు..!
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు తాడ్డి రామలక్ష్మి. ఆమెది మెంటాడ మండలం చినతాడివలస. పాము కరవడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రెండు రోజుల కిందట చేరారు. శుక్రవారం ఆ మహిళకు డ్రెస్సింగ్ చేయాలని వైద్యులు సూచించారు. అక్కడ వార్డు సిబ్బంది లేక పోవడంతో వీల్ చైర్‌ను ఆమె బంధువే తోసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకొచ్చారు.’
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు తుంపల్లి జయ. ఆమెది గజపతినగరం మండలం పట్రువాడ. గజపతినగరం ఆస్పత్రిలో రక్తం ఎక్కించడం వల్ల రియాక్షన్ కావడంతో అక్కడి వైద్యులు ఇక్కడకు రిఫర్ చేశారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళకు వీల్‌చైర్ తెమ్మని ఆస్పత్రి సిబ్బందిని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆమె బంధువే వీల్‌చైర్‌లో మహిళను కూర్చోబెట్టి రక్త పరీక్షల విభాగం వద్దకు తీసుకెళ్లారు.
![రోగి బంధువులే వార్డు బాయ్‌లు..! 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07vzg17a-370049_mr-1738955458-1.jpg)
రోగి బంధువులే వార్డు బాయ్‌లు..!
Comments
Please login to add a commentAdd a comment