![వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05vzg26-370044_mr-1738783472-0.jpg.webp?itok=-ZIdprJ3)
వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు
● పదిరోజుల్లో సర్వే పూర్తి చేయాలి● కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు
విజయనగరం అర్బన్: జిల్లాలోని వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చాంబర్‌లో బుధవారం నిర్వహించారు. వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకో వాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 99 వక్స్ స్థలాలను గుర్తించామని వాటిలో 32 స్థలాలను ఇప్పటికే నోటిపై చేసినట్లు చెప్పారు. మొత్తం అన్ని స్థలాల వివరాలను రెండు రోజుల్లో సంబంధిత ఆర్‌డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్, మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. వివరాలు ఇచ్చిన పది రోజుల్లోగా స్థలాలన్నిటినీ సర్వే చేసి, సరిహద్దులు నిర్ణయించాలని ఆర్‌డీఓలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, ఎస్‌డీసీ జోసెఫ్, జిల్లా రిజిస్ట్రార్ కుమారి, సర్వే శాఖ ఎ.డి రమణమూర్తి, ఆర్‌డీఓ డి.కీర్తి, మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, జె.రామప్పలనాయుడు, రామలక్ష్మి, అప్పలరాజు, జిల్లా మైనారిటీ అధికారి ఆర్‌ఎస్‌జాన్, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ షాహీ షేక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment