లౌకిక శక్తులను గెలిపించాలి : సీపీఎం | Sakshi
Sakshi News home page

లౌకిక శక్తులను గెలిపించాలి : సీపీఎం

Published Thu, Apr 18 2024 9:30 AM

- - Sakshi

పెబ్బేరు రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించి వామక్ష లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని యాదవభవన్‌లో జరిగిన వామపక్షాల జిల్లా సదస్సుకు ఆయనతో పాటు సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటాయనిఽ, అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌, పుట్టా ఆంజనేయులు, జీఎస్‌ గోపి, బాల్‌రెడ్డి, లక్ష్మి, మేకల ఆంజనేయులు, ప్రసాద్‌, రాజన్న, గణేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

రామన్‌పాడులో

నీటిమట్టం తగ్గుముఖం

మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. బుధవారం 1,011 అడుగులు ఉండగా.. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి అవసరాలకు 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్‌రెడ్డి వివరించారు.

సివిల్స్‌ ర్యాంకర్‌ అనన్యరెడ్డికి సన్మానం

అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్‌ సాధించిన పొన్నకల్‌ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు మహిమూద్‌, విజయకుమార్‌రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జాజాల రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement