ఉల్లి క్వింటా రూ.2,400 | Sakshi
Sakshi News home page

ఉల్లి క్వింటా రూ.2,400

Published Wed, May 8 2024 3:30 AM

ఉల్లి క్వింటా రూ.2,400

దేవరకద్ర: సీజన్‌ ముగుస్తున్న సమయంలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అటు ఇటుగా వచ్చిన ధరలు.. గత వారం వరకు కొనసాగాయి. కానీ, ఈ వారం ఒక్కసారిగా ఉల్లి ధర ఎగబాకింది. ఇతర మార్కెట్లలో ఉల్లి దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారు లు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకున్న రైతులకు ఉల్లి అమ్మకాలతో లాభాలు వచ్చే అవకాశం ఉంది.

ఒకరోజు ముందుగానే వేలం..

అమావాస్య కారణంగా బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు సెలవు కావడంతో మంగళవారమే ఉల్లి వేలం నిర్వహించారు. ఈ విషయం ముందుగానే రైతులకు చెప్పడంతో పలు గ్రామాల నుంచి ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఉల్లి దిగుబడులు తక్కువ కావడం.. మరోపక్క కొనుగో లు పెరగడంతో ధరలు 40 శాతం వరకు పెరిగాయి. వేలంలో క్వింటాల్‌ ఉల్లికి గరిష్ట ధర రూ.2,400, కనిష్ట ధర రూ.1,900 వరకు వచ్చింది. గత వారంతో పోల్చితే గరిష్టంగా రూ. 800, కనిష్టంగా రూ.900 వరకు పెరిగాయి.

45 కిలోల బస్తా రూ.1,200..

మార్కెట్‌లో 45 కిలోల ఉల్లి ధర గరిష్టంగా రూ.1,200 నుంచి రూ.1,100 వరకు విక్రయించారు. కనిష్టంగా రూ.వెయ్యి నుంచి రూ.900 వరకు అమ్మకాలు సాగించారు. గత వారం ఉల్లి బస్తా ధర ఎక్కువగా రూ.800, తక్కువగా రూ.600 వరకు ఉండగా ఈ వారం పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు సతమతమయ్యారు. అయితే నిల్వ చేసుకోడానికి అనువుగా ఉండటంతో ఉల్లిని చాలామంది కొనుగోలు చేశారు.

కనిష్టంగా రూ.1,900

Advertisement
Advertisement