రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

Published Sat, Sep 21 2024 1:26 AM | Last Updated on Sat, Sep 21 2024 1:26 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

వనపర్తి: తప్పులు లేని శుద్ధమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా ప్రచురణలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. డీపీఓ గ్రామాలు, వార్డుల వారిగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉంచామని ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితా చూసుకొని ఏమైనా ఫిర్యాదులు ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ బూత్‌కు ఓట్లు ఉండటం, లేదా మరణించిన, బదిలీ అయిన వారి ఓట్ల తొలగింపు, కొత్త పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు వంటి సమస్యలపై లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం లోగా ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని, ఈ నెల 26 వరకు అన్ని ఫిర్యాదులు పరిష్కరించి 28న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు, మరణించిన ఓటర్ల పేర్లు సేకరిస్తారన్నారు. పోలింగ్‌ స్టేషన్ల మార్పిడి చేస్తామని, కొత్తగా 20 పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దేవరకద్ర, ఆత్మకూరు, అమరచింత ప్రాంతాల్లో పది, కొత్త పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఇంకా అవసరమైతే.. దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిచేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement