పాఠశాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పరిశీలన

Published Sat, Sep 21 2024 1:26 AM | Last Updated on Sat, Sep 21 2024 1:26 AM

పాఠశా

వనపర్తి రూరల్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం అందించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని చిట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో విద్యార్థులతో పుస్తక పఠనం చేయించడంతోపాటు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు 10 జీపీఏ సాధించాలని సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం సంజీవయ్య, ఉపాధ్యాయులు వరదాచారి, రుద్రమదేవి, గిరిరాజాచారి, రవి తదితరులున్నారు.

రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 820 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో ఎన్టీఆర్‌ కాల్వ ద్వారా 1,100 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 20 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 855 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదిలామని ఏఈ రనీల్‌రెడ్డి తెలిపారు.

ఆర్టీసీని ఆదరించాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి అన్నారు. మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆర్టీసీలో మర్యాద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు పలువురు ప్రయాణికులకు పూలు, గిఫ్ట్‌గా పెన్‌, చాక్లెట్లు అందజేశారు. ఆర్‌ఎం మాట్లాడు తూ ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులే కీలకమని, వారి పట్ల ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా నడుచుకోవాలనితెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సేవలను డిపోలు లేదా బస్‌స్టేషన్లలోని ఉద్యోగులను సంప్రదించాలని కోరారు. డీఎం సుజాత, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,539

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 941 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,539, కనిష్టం రూ.1,900, సరాసరి రూ.4,689 ధరలు పలికాయి. అలాగే, 84 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5,781, కనిష్టం రూ.4,709, సరాసరి రూ.5,760 ధరలు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
పాఠశాల పరిశీలన 
1
1/1

పాఠశాల పరిశీలన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement