దుర్గామాత ఆశీస్సులు ఉండాలి | - | Sakshi
Sakshi News home page

దుర్గామాత ఆశీస్సులు ఉండాలి

Published Fri, Oct 11 2024 12:54 AM | Last Updated on Fri, Oct 11 2024 12:54 AM

దుర్గామాత ఆశీస్సులు ఉండాలి

వనపర్తి: నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులకు దుర్గామాత అనుగ్రహం ఉండాలని.. సదా విజయం వరించాలని ఎస్పీ రావుల గిరిధర్‌ ఆకాంక్షించారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఆయుధపూజలో ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుశాఖ సఫలీకృతం కావాలని, దుర్గామాత కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, విధి నిర్వహణలో ఆయుధాలు, వాహనాలకు ఎలాంటి ఆటంకం కలుగరాదని పూజలు చేశామన్నారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సాయుధదళ ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సాయదదళ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, అప్పలనాయుడు, వనపర్తి సీఐ నాగభూషణరావు, ఎస్‌ఐలు జయన్న, రామరాజు, ఎస్‌బీ ఎస్‌ఐలు నరేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ రావుల గిరిధర్‌

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ, వాహన పూజ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement