త్వరితగతిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన

Published Fri, Oct 11 2024 12:54 AM | Last Updated on Fri, Oct 11 2024 12:54 AM

త్వరితగతిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన

త్వరితగతిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన

వనపర్తి: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పుర కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారి లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న వాటిని క్రమబద్దీకరించేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ఇందిర మహిళాశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్‌ పక్కాగా చేపట్టాలని కోరారు. స్వశక్తి మహిళా సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో అందించాలన్నారు.

అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement