బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

Published Fri, Nov 15 2024 12:13 AM | Last Updated on Fri, Nov 15 2024 12:15 AM

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

వనపర్తి: అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్‌, ఈడబ్ల్యూఐడీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కోరారు. ఈడబ్ల్యూఐడీసీశాఖకు కేటాయించిన 18 అంగన్‌వాడీల్లో మరుగుదొడ్ల పనులు ప్రారంభం కాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో పూర్తిచేసి యూసీ సమర్పించాలని.. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ మల్లయ్య, ఈడబ్ల్యూఐడీసీ ప్రణాళిక అధికారి భూపాల్‌రెడ్డి, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement