తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా ఎంపిక
పెబ్బేరు రూరల్: తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కురుమయ్య ఎంపికై నట్లు ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాపిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 20 వరకు మధ్యప్రదేశ్‌లోని గధర్వార్ నర్సింగ్‌పూర్ జిల్లాలో జాతీయస్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు.
మార్కెట్‌లో
జోరుగా విక్రయాలు
జడ్చర్ల/బాదేపల్లి: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం పంట ఉత్పత్తులు పోటెత్తా యి. వివిధ ప్రాంతాల నుంచి 6,540 క్వింటాళ్ల ధాన్యం, 2,244 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,411, కనిష్టంగా రూ.1,200గా ధరలు లభించాయి. ధాన్యం హంస రకం గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,827, ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,697, కనిష్టంగా రూ.1,625, సోనా మసూరి రూ.1,611 , వేరుశనగ గరిష్టంగా రూ. 6,351, కనిష్టంగా రూ.5,127 ధరలు పలికాయి.
● దేవరకద్ర మార్కెట్ కార్యాలయంలో జరిగిన ఈనామ్ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ సోనామసూరి ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,409, కనిష్టంగా రూ.1,901గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 5 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. గురునానక్ జయంత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు ఉంటుందని సెక్రటరీ జయలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు.
18న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా ఐడీఓసీలో ఈనెల 18 సోమవారం ఉదయం 10:30 గంటలకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన బి.వెంకటేశ్వరరావు బృందం నేతృత్వంలో సమావేశం ఉంటుందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు డెడికేటెడ్ కమిషన్ బృదం సభ్యులకు నమోదిత లేదా నమోదు కాని అసోసియేషన్ సంఘాల ప్రజాప్రతినిధులు వారికి అవసరమైన రిజర్వేషన్, దామాషాను, వాదనలను, ఆక్షేపణలు, సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బీసీలకు స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లను, దామాషాను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు ఈ బృందం పర్యటిస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని వివిధ సామాజిక వర్గాల వారు ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా బృందానికి తెలియజేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment