మహనీయుడు చాచా నెహ్రూ
వనపర్తిటౌన్/వనపర్తి విద్యావిభాగం: సుఖంగా జీవించగలిగే అన్ని సౌకర్యాలు, వసతులు ఉండి కూడా దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడిన మహోన్నతుడు చాచా నెహ్రూ అని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ కొనియాడారు. గురువారం కాంగ్రెస్‌పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కార్యనిర్వాహక అధ్యక్షుడి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం ఎదుట, జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయంలో లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి వేర్వేరుగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత ప్రధాని హోదాలో నెహ్రూ వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. నెహ్రూ దార్శనికత, నిరాడంబరత నేటితరం తెలుసుకోవాలన్నారు. చిన్నారులపై ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఉండే నెహ్రూ జయంతిని భారతవని బాలల దినోత్సవంగా జరుపుకొంటుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్ల విజయ్‌చందర్, కార్వనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు, పుర చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, నాయకులు ఎల్.సతీష్, లైబ్రేరియన్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment