కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పాన్‌గల్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రేమద్దుల, మాందాపూర్, మల్లాయిపల్లి, దొండాయిపల్లి, దావాజిపల్లి, కేతేపల్లి గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించనుందని పేర్కొన్నారు. కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని, నీడ కోసం టెంట్, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, డైరెక్టర్లు ఉస్మాన్, జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్, రాముయాదవ్, బ్రహ్మయ్య, జయరాములుసాగర్, సీఈఓ భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment