కొత్త ఉల్లి రాకతో.. | - | Sakshi
Sakshi News home page

కొత్త ఉల్లి రాకతో..

Published Thu, Oct 24 2024 12:15 AM | Last Updated on Thu, Oct 24 2024 12:15 AM

-

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌కు కొత్త ఉల్లి వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

వివరాలు 8లో u

బిల్లు చెల్లింపులు ఇలా..

ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్య ఆధారంగా చెల్లింపులు చేస్తారు. పెద్దరకం చేప పిల్లలు ఒక్కింటికి రూ.1.61, చిన్న వాటికి రూ.0.60 ధర చెల్లిస్తారు. డబ్బాతోగాని, కిలో లెక్కనగాని ఒకసారి కొలిచి వాటిని లెక్కిస్తారు. ఈ లెక్కన కాంట్రాక్టర్‌ ఎన్ని డబ్బాలు, కిలోలు సరఫరా చేస్తే.. అన్నింటిని లెక్కించి బిల్లుల చెల్లింపునకు జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫారస్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెద్ద రకం చేప పిల్లలు 3 నుంచి 3.5 అంగుళాలు, చిన్న రకం 1.5 అంగుళాల పొడవు మాత్రమే ఉండాలి. పిల్లలు చిన్నగా ఉంటే కౌంటింగ్‌ ఎక్కువై ఎదుగుదల ఆశాజనకం ఉండకపోవచ్చు. చేప పిల్లల సైజ్‌ పెద్దగా ఉంటే కౌంటింగ్‌ తక్కువగా ఉంటుంది. దీంతో చెరువులకు సరిపడా చేప పిల్లలు చేరవు. సైజు పెద్దగా ఉన్నా.. చిన్నగా ఉన్నా మత్స్యకారులకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిబంధనలు పాటిస్తే పెద్దరకం చేప పిల్లలు కిలోకు 250 నుంచి 350 వరకు ఉండాలి. సైజ్‌ పెద్దగా ఉంటే కౌంటింగ్‌ తగ్గుతుంది. చిన్నగా ఉంటే కౌంటింగ్‌ పెరిగి ఎక్కువ బిల్లు చెల్లించే ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు గుర్తించి బిడ్డింగ్‌లో పేర్కొన్న విధంగా సైజ్‌లు ఉంటేనే చెరువుల్లో వదిలేందుకు అనుమతించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పేర్కొన్న సైజుల్లో సరఫరా చేస్తే అనుకున్న మేరకు ఆయా చెరువులు, రిజర్వాయర్లకు చేప పిల్లలు చేరుతాయి.

25 చెరువులు.. 13 లక్షలు...

జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువుల్లో 1.20 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేసేందుకు జిల్లా మత్స్యశాఖ అఽధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారు 25 చెరువుల్లో 13 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలుస్తోంది. సైజుల విషయంలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మత్స్యకారులకు నష్టం వాటిల్లినా.. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement