● కురుమూర్తి, మన్యంకొండ
ఆలయాలపై ప్రత్యేక దృష్టి
● ప్రతి గ్రామానికి, తండాకూ బీటీ రోడ్డు
● సమగ్ర అంచనాలు రూపొందించాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి, 5 జిల్లాల
కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
● మంత్రులు కోమటిరెట్టి, దామోదరతో
కలిసి కురుమూర్తి స్వామి దర్శనం
● రూ.110 కోట్ల ఎలివేటెడ్ కారిడార్,
ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన బూర్గుల రామకృష్ణారావు ఆనాడు హైదరాబాద్ రాష్టానికి ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ తర్వాత మహబూబ్‌నగర్ బిడ్డల ఆశీర్వాదంతో ఇప్పుడు మీ బిడ్డ సీఎం అయ్యాడు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత ఈ అవకాశం వచ్చిందని.. ఎవరు అడ్డుపడినా ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసి తీరుతామన్నారు. జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేస్తామని, ఇటీవలే మక్తల్, కొడంగల్, నారాయణపేట స్కీమ్‌కు టెండర్లు పూర్తయ్యాయని.. త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు కృష్ణాజలాలు పారుతాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి తొలుత దేవాలయ గోపురం వద్ద రూ.110 కోట్ల వ్యయంతో 3.7 కి.మీ.ల ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్, దేవస్థాన ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment